Nithiin: హిట్‌ డైరక్టర్‌ కోసం నితిన్‌ అలా మారుతున్నాడా!

  • December 7, 2022 / 12:22 AM IST

మెగాస్టార్‌తో సినిమా చేయాల్సిన వెంకీ కుడుముల పవర్‌ స్టార్‌ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్‌తో సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. బాస్‌ సినిమా వర్కవుట్‌ కాకపోవడంతో.. వెంకీ కుడుముల వెంటనే తన దగ్గరున్న ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథను నితిన్‌కి వినిపించారని ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం బయటికొచ్చింది. అది సినిమా ప్లాట్‌. అది విన్నాక.. వెంకీ మరోసారి తన ట్రేడ్‌మార్క్‌ కథ రాసుకున్నారు అంటున్నారు.

‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో వినోదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెంకీ కుడుముల. ‘భీష్మ’ తర్వాత నితిన్‌తో మరోసారి సినిమా చేస్తారు అని వార్తలొచ్చినా.. అనుకున్నట్లుగా కుదర్లేదు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య సినిమా కథ చర్చలు జరిగాయట. అందులో భాగంగా నితిన్‌ కోసం వెంకీ ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చెప్పారట. అందులో నితిన్ విడాకులు తీసుకున్న భర్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఒంటరిగా బతికే ఓ మగాడి కథగా ఆ సినిమా ఉంటుందట.

ఇప్పటికే ఈ స్క్రిప్ట్ రెడీ చేశారని, మరికొన్ని హంగులు జోడించి సినిమాగా సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తారని టాక్‌. అందులో నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ కూడా ఉంటుంది అంటున్నారు. నిజానికి టాలీవుడ్‌లో ఇలాంటి పాత్రలు పెద్దగా రాలేదు. దాంతోపాటు ఇది సీరియస్‌ సబ్జెక్ట్‌గా కనిపిస్తోంది. అయితే వెంకీ కుడుముల దీనిని కూడా ఫన్నీ వేలో చూపించాలని అనుకుంటున్నారట.

ఇక నితిన్‌ సంగతి చూస్తే.. ఇటీవల ఓ సినిమాను ప్రారంభించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. ఫారెస్ట్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. దీని కోసం మారేడుమిల్లి ప్రాంతంలో షూట్‌ మొదలుపెట్టారు. ఈ సినిమాలో నితిన్‌ రగ్‌డ్‌ లుక్‌లో కనిపిస్తారట. అదే వెంకీ సినిమా విషయానికొస్తే రెండు రకాల లుక్‌లు ఉంటాయట. ఒకటి శాడ్‌ లుక్‌ అయితే, ఇంకొక లుక్‌ కాలేజీ లుక్‌లో ఉంటుందట.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus