భారతీయుడు 2 గురించి ఆసక్తికర విషయం

  • September 6, 2018 / 11:01 AM IST

కమర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో నేర్పరి అయిన డైరక్టర్ శంకర్ 2 .O సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కంటే శంకర్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెల కొంది. అదే “భారతీయుడు 2 “. విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన భారతీయుడు(ఇండియన్) మూవీ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ పనులు మొదలయ్యాయి. ఆర్టిస్టుల సెలక్షన్ మొదలు పెట్టారు. హీరోయిన్ గా నయనతార ని తీసుకున్నారు.

మరో పాత్రకోసం బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగణ్‌ ని సెలక్ట్ చేశారు. అలాగే సినిమాటో గ్రాఫర్‌ రవివర్మన్‌ తో శంకర్‌ కలిసి థాయ్‌లాండ్‌లో లొకేషన్లు వెతుకుతున్నారు. థాయ్‌లాండ్‌లో కీలకమైన సన్నివేశాలతో పాటు, రెండు పాటలు, ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. యువ సంగీతం సంచలనం అనిరుధ్‌ సంగీతం అందించనున్న ఈ మూవీ గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. తొలిభాగం తరహాలోనే సీక్వెల్లోనూ కమల్‌హాసన్‌ రెండు పాత్రలు ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ సారి సేనాపతి ఎటువంటి సమస్యలపై పోరాటం సాగిస్తారో చూడాలని భారతీయ సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus