టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కె భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొణె నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ ఏడాది నవంబర్ నెల నుంచి ప్రాజెక్ట్ కె రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అశ్వనీదత్ అన్నారు. దాదాపు 13 నెలలు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను పూర్తి చేసి ప్రాజెక్ట్ కె సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారని ఈ సినిమాకే పరిమితం కానున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కె కోసం 200 రోజుల డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్ ను పూర్తి చేసి సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేయనుండగా ఆదిపురుష్, సలార్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూపిస్తారని తెలుస్తోంది.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?