స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా సలార్ తెరకెక్కనుండగా హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీని ఈ సినిమా కొరకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది.
గతంలో బ్యాట్ మ్యాన్, మ్యాట్రిక్స్ సినిమాలకు ఏ టెక్నాలజీని వినియోగించారో అదే టెక్నాలజీని సలార్ కొరకు వినియోగిస్తూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్లు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించే విధంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్న పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. శృతిహాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించనున్నారని సమాచారం. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. రవి బస్సుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బాహుబలిని మించిన సక్సెస్ ను ప్రభాస్ కు ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!