సినిమాల జయాపజయాలను క్రికెట్ భాషలో చెప్పిన ఎన్టీఆర్
April 3, 2018 / 12:29 PM IST
|Follow Us
జయాపజయాలకు ఎవరూ అతీతులు కారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారు. ఒకసారి అపజయాన్ని చూసినప్పుడే విజయం విలువ తెలుస్తుందన్నారు. తొలిసారి తారక్ ఐపీఎల్ సీజన్ కి తెలుగులో అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆ ప్రకటనకు సంబంధించిన వీడియోని ఈరోజు మీడియా సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనకి ఈ అవకాశమిచ్చిన స్టార్ ఇండియా, స్టార్ మా మూవీస్ వారికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ప్రోమోని డైరక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు చెప్పారు. అనంతరం మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. తనకి క్రికెట్ ఆడడం అన్నా.. చూడడం అన్నా ఇష్టమే అని వెల్లడించారు. క్రికెట్ పై ప్రేమ ఏర్పడటానికి తన తండ్రి హరికృష్ణ కారణమని తెలిపారు.
చిన్నప్పుడు నాన్నతో కలిసి సినిమా చూడడం వల్లే క్రికెట్ పై ప్రేమ పెరిగిందని వివరించారు. ఇష్టమైన ప్లేయర్ ఎవరని ప్రశ్నించగా “సచిన్” అని సమాధానమిచ్చారు. “మీ సినీ జీవితంలో సిక్స్ కొట్టామని ఏ చిత్రానికి అనిపించిందని అడగగా.. ఆలోచించకుండా సింహాద్రి అని వెల్లడించారు. “సింహాద్రితో తొలి సిక్స్ కొట్టాను. అప్పుడే సక్సస్ ని ఎంజాయ్ చేసాను. ఆ తర్వాత సిక్స్ కొట్టాను. చాలా సార్లు డకౌట్ కూడా అయ్యాను” అని గట్టిగా నవ్వేశారు. ఇంకా మాట్లాడుతూ “ఓటమిని చూసినప్పుడే గెలవాలనే తపన పెరుగుతుందనే కసి పెరుగుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడో పెద్దలు చెప్పారు. నేను కూడా సినీ కెరీర్ లో జయాపజయాలు చూసాను” అని తెలిపారు.