ఐరా సినిమాస్ ప్రొడ‌క్ష‌న్ నం.1 ఫిల్మ్ ప్రారంభం

  • November 7, 2020 / 07:46 PM IST

నాగ‌శౌర్య హీరోగా ‘ఛ‌లో’, ‘అశ్వ‌థ్థామ’ లాంటి సూప‌ర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేష‌న్స్ సంస్థ నుంచి సోద‌ర సంస్థ‌గా ఐరా సినిమాస్ ప్రారంభ‌మైంది. ఔత్సాహిక న‌టులు, ద‌ర్శ‌కుల‌తో కంటెంట్ ప్ర‌ధాన చిత్రాల‌ను నిర్మించ‌డం ఐరా సినిమాస్ ఏర్పాటులోని ఉద్దేశం. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టాల‌ని క‌ల‌లు క‌నే నూత‌న‌ న‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఇది మంచి అవ‌కాశం. హైద‌రాబాద్‌లోని సంస్థ కార్యాల‌యంలో ఐరా సినిమాస్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రిగింది. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి న‌టుడు, వ్యాపార‌వేత్త, ఏఎస్‌పీ మీడియా హౌస్‌ అధినేత అభిన‌వ్ స‌ర్దార్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. న‌వంబ‌ర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంక‌ర్‌ప్ర‌సాద్ ముల్పూరి మాట్లాడుతూ, “ఇవాళ మంచిరోజు కావ‌డంతో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. ఐరా సినిమాస్ అనేది ఐరా క్రియేష‌న్స్‌కు సోద‌ర సంస్థ‌. యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో బ్యాన‌ర్‌ను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌ను ఈ బ్యాన‌ర్‌పై నిర్మిస్తాం. స‌న్నీ కొమాల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్ల‌ర్” అని చెప్పారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus