“ఐరావతం” టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్  

  • November 17, 2021 / 04:23 PM IST

రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో  రాంకీ పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరిలు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “ఐరావతం”.ఈ ఐరావతం ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా

దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ..  ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ టూ మై ప్రొడ్యూసర్స్ ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక వర్గానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

నిర్మాతలు మాట్లాడుతూ : ఈ చిత్రాన్ని కథ లోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందని ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అర్థమైంది. ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాము. మా ఈ ఫస్ట్ లుక్ కి ఇంతటి ఆదరణ తీసుకొచ్చిన పి ఆర్ ఓ మధు గారికి మరియు ఆయన టీం కి ధన్యవాదాలు .

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus