Akhamda Movie: బాలయ్య అభిమనుల ఆశ తీరుతుందా?

  • August 26, 2021 / 05:02 PM IST

గడిచిన పది సంవత్సరాల్లో బాలకృష్ణ సినీ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు లెజెండ్ సమాధానంగా వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవడం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే అఖండ సినిమాతో బాలయ్య ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖండ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తూ ఉండటంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.

అఖండ మరో లెజెండ్ అవుతాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటనను బట్టి అఖండ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. రెండు పాటల షూటింగ్ మినహా అఖండ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. దసరాకు అఖండ రిలీజైతే మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉంటాయి.

దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అఖండ మూవీతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావిస్తున్నారు. 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. అఖండ సినిమాలో పూర్ణ, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే ఈ హీరోయిన్లకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus