అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ తన నటనలో అంతగా సహజత్వం కనిపించదు. ఏదో చేశామా.. అంటే చేసాము అన్నట్టే శిరీష్ నటన ఉంటుంది. శిరీష్ చేసిన సినిమాలన్నీ మంచి కథలే..! కానీ తన నటన.. స్క్రీన్ అప్పీరెన్స్ ప్రేక్షకుల్ని పెద్దగా అక్కట్టుకోదనే చెప్పాలి. అందుకే శిరీష్ వల్ల మంచి మంచి కథలు వృధా అయిపోయాయనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా శిరీష్ కు ఉండదనేది తెలిసిన సంగతే. ఏదో అల్లు అరవింద్ కొడుకు కదా అని మంచి నిర్మాతలు, మంచి కథలు ఈ బాబుగారి దగ్గరకే వస్తాయి. ప్రేక్షకులు శిరీష్ ను యాక్సెప్ట్ చేయకపోయినా… నిర్మాతలకి మాత్రం తప్పదు భరించాలి.
ఇప్పుడీ పరిస్థితి మధురశ్రీధర్ కి వచ్చింది. ఆయన శిరీష్ తో నిర్మిస్తున్న ‘ఎబిసిడి’ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఈ చిత్ర షూటింగ్ టైంలో శిరీష్… ఓ స్టార్ హీరో రేంజ్లో బిల్డప్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్ర టెక్నీషియన్లను కొంతమందిని శిరీష్ మార్చేసాడని… కూడా వార్తలు వచ్చాయి. అయితే కిందా… మీదా పడి దర్శక నిర్మాతలు.. ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. తాజాగా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ కు చూపించారట. కొన్ని రిపేర్లు చేయాలని అల్లు అరవింద్ చెప్పారని తెలుస్తుంది. అయితే నిర్మాతకి, హీరో శిరీష్ కు మధ్య ఎడిటింగ్ వెర్షన్ విషయంలో అభిప్రాయాలు కుదరడం లేదట. ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా శిరీష్ సపోర్ట్ చేయడం లేదని తెలుస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు సర్దుమణిగి… సినిమా విడుదలవుతుందో చూడాలి..!