Anand Deverakonda: విజయ్ దేవరకొండ తమ్ముడి పై డేటింగ్ రూమర్స్.. మేటర్ ఏంటి?
July 10, 2023 / 11:59 AM IST
|Follow Us
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అందరికీ సుపరిచితమే. ‘దొరసాని’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇతను మొదటి సినిమాతో మంచి నటుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిత్రంతో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు.2020 లాక్ డౌన్ టైంలో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అయ్యింది. అటు తర్వాత ఇతను నటించిన ‘పుష్పక విమానం’ కంటెంట్ పరంగా మెప్పించినా కమర్షియల్ సక్సెస్ అయితే అందుకోలేదు.
ఇక ‘హైవే’ సినిమా అయితే నేరుగా ఆహాలో రిలీజ్ అయ్యింది. ఇక (Anand Deverakonda) ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ సినిమా వచ్చేవారం అంటే జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి మంచి మార్కులు వేయించుకుంది. ఈ సినిమా ఆనంద్ కి మంచి సక్సెస్ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఆనంద్ దేవరకొండ హీరోయిన్ వర్ష బొల్లమతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటి పై క్లారిటీ ఇచ్చాడు.
అతను మాట్లాడుతూ.. “వర్ష బొల్లమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్. అంతే..! ఇందులో దాచడానికేం లేదు. మేం ఇద్దరం డాగ్ లవర్స్. కుక్కల గురించి ఎక్కువ మాట్లాడుతూ బాగా కనెక్ట్ అయిపోయాం. అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మేమిద్దరం కలిసి సినిమా చేసి 3 ఏళ్ళు అయ్యింది. అయినా ఇంకా టచ్ లోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే, వర్ష బొల్లమ్మ నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్” అంటూ క్లారిటీ ఇచ్చాడు.