స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది. సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను అఖండ సినిమాతో ఆ సినిమాలను మించిన హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతేడాది బాలకృష్ణ దసరా కానుకగా నర్తనశాల సినిమాను ఏటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 17 నిమిషాల ఫుటేజ్ తో రిలీజైన ఈ సినిమాకు కోటీ 25 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.
బాలయ్య హీరోగా తెరకెక్కి రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలలో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన విక్రమ సింహ భూపతి ఒకటి. ది లయన్ కింగ్ ఆధారంగా తెరకెక్కి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణం వల్ల ఆగిపోయింది. ఈ సినిమాను ఓటీటీ లేదా ఏటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సినిమాతో పాటు తెలుగులో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోని బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాను సీనియర్ ఎన్టీఆర్ హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీ రీమేక్ లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాను కూడా ఓటీటీలో లేదా ఏటీటీలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభిమానుల కోరికను బాలకృష్ణ తీరుస్తారో లేదో చూడాల్సి ఉంది.