Chiranjeevi: చిరంజీవి వెబ్‌ సిరీస్‌ చేస్తారా? అంతా రెడీనా? ఇదిగో క్లారిటీ!

  • February 15, 2024 / 10:41 AM IST

సినిమా హీరోల ఆ మాటకొస్తే సినిమా జనాలు ఓ మాట అన్నారు అంటే.. దాని వెనుక తవ్వి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఓ సీనియర్‌ స్టార్‌ హీరో గురించి వస్తున్న వార్తలు వింటుంటే నిజమేనా? అంతర్లీనంగా ఉన్న విషయాలు ఏంటి అనే ప్రశ్న వస్తోంది. ఎందుకంటే లీకుల రూపంలో వస్తున్న విషయం ఏమంత చిన్నది కాదు. అయితే ఇది నిజమైతే బాగుండు అని కొంతమంది ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

మరోవైపు వద్దు అని మరికొంతమంది ఫ్యాన్స్‌ అంటున్నారు. అదే ‘చిరంజీవి ఓటీటీ ఎంట్రీ’. సినిమాల్లో మెగాస్టార్‌ అనిపించుకున్న చిరంజీవి ఆ మధ్య టీవీల్లోకి కూడా వచ్చారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఓ సీజన్‌ చేశారాయన. అయితే ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. వరుసగా సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే టీవీల్లోకి రావడం లేదు అని టాక్‌. అయితే ఈ సమయంలో చిరంజీవి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తారు అని పుకారు మొదలైంది.

దీని కోసం అగ్ర దర్శకరచయితలు ఓ కథను సిద్ధం చేస్తున్నారని కూడా టాక్‌. అయితే ‘రానా నాయుడు’ ఎఫెక్ట్‌ వల్ల ఆగింది అని కూడా వార్తలొస్తున్నాయి. ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి… ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్ట్‌ ఏదీ ప్రారంభించాలని అనుకోవడం లేదని ఓ టాక్‌. అందుకే ఇంకా 157వ సినిమా ఏంటి అనేది చెప్పలేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ సిరీస్‌ను చేసే పరిస్థితే లేదు అని చెప్పాలి.

ఒకవేళ టాక్‌ షో లాంటిది కానీ, ‘సత్యమేవ జయతే’ లాంటి ఇన్‌స్పిరిషనల్‌ షోను చేస్తే చేయొచ్చు. ఎందుకంటే నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేయొచ్చు. డేట్స్‌ అడ్జెస్ట్‌మెంట్‌ సమస్య కూడా ఉండదు. నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ కొత్త సీజన్‌కే సరిగ్గా గెస్ట్‌లు దొరకడం లేదు అనే విమర్శ వినిపిస్తున్న ఈ రోజుల్లో చిరు ఒకవేళ టాక్‌ షో చేస్తే ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయనేది చూడాలి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus