Indra Re-Release: చిరంజీవి సినిమాకు స్క్రీన్ల కష్టాలు.. బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా? లేదా?
August 13, 2024 / 07:17 PM IST
|Follow Us
రీరిలీజ్‌ల ట్రెండ్.. రవితేజ (Ravi Teja) మాటల్లో చెప్పాలంటే పిచ్చి.. నడుస్తున్న రోజులివి. ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi) సినిమాలు కొన్ని ఈ లిస్ట్‌లోకి చేరితే బాగుండు అని.. చాలా రోజులుగా అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి వాటిలో ‘ఇంద్ర’ (Indra) ఒకటి. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ (B. Gopal) డైరక్షన్లో రూపొందిన సినిమా చిరు కెరీర్లోనే కాదు.. మొత్తంగా టాలీవుడ్లో రికార్డు బ్రేకింగ్ సినిమా. అలాంటి సినిమా రీరిలీజ్ అంటే ఎంత హడావుడి ఉండాలి. ఇప్పుడు.. ఇదే చర్చ టాలీవుడ్లో నడుస్తోంది.
‘ఇంద్ర’(Indra) లాంటి మోస్ట్ అవైటెడ్ సినిమా రీరిలీజ్‌కి రెడీ అవుతున్న సమయం.. అందులోనూ ‘మురారి’ (Murari) సినిమా తీసుకొచ్చిన రికార్డు బజ్ నేపథ్యంలో ‘ఇంద్ర’ రాక మామూలూగా ఉండకూడదు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కనీసం రెండు వారాల ప్రచారం అయినా ఉండాలి.. సోషల్ మీడియాలో దుమ్మురేగిపోవాలి అని అంటున్నారు. కానీ.. గ్రౌండ్లో పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. సినిమా నిర్మాణ సంస్థ ట్విటర్లోనూ ఆ ఊసు లేదు.
దీంతో సినిమా రాక నిజమా? కాదా? అనే డౌట్ కూడా కలుగుతోంది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. థియేటర్ల పంచాయతి అని అంటున్నారు. సినిమా రీరిలీజ్ డేట్ నాటికి అవసరమైన స్క్రీన్స్ దొరకడం కష్టమే అనే మాట వినిపిస్తోంది. దానికి కారణం ఆగస్టు 15న మూడు పెద్ద సినిమాలు వస్తుండటమే అంటున్నారు. మీకు తెలిసిన విషయమే. ఆగస్టు 15న రామ్ (Ram) – పూరి(Puri Jagannadh) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart), రవితేజ – హరీశ్ శంకర్ (Harish Shankar) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) , విక్రమ్ (Vikram) – పా. రంజిత్ (Pa. Ranjith) ‘తంగలాన్’ (Thangalaan) వస్తున్నాయి.
వీటితోపాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఆ రోజుకు రెడీ అవుతున్నాయి. వీటి ఫలితాల లెక్క తేలాకే ‘ఇంద్ర’ స్క్రీన్లు, థియేటర్ల సంఖ్య తేలుతుంది అంటున్నారు. దీంతో ఆగస్టు 15 వస్తే కానీ ‘ఇంద్ర’ రీరిలీజ్ సంగతిలో క్లారిటీ రాదు అని చెబుతున్నారు. కొందరైతే రీరిలీజ్ డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటే.. కొందరేమో ఇన్నేసి సినిమాలు ఒకే వారం రావడం వల్ల కూడా సమస్యే అంటున్నారు.