ఇటు జనాలు.. అటు నిర్మాతలు.. మధ్యలో నలిగిపోతున్న సింగిల్ స్క్రీన్లు!
July 29, 2024 / 11:37 AM IST
|Follow Us
రెండూ థియేటర్లే కావొచ్చు, రెండింటిలో సినిమాలే ప్రదర్శించొచ్చు కానీ.. రెండూ ఒకటి కాదు. అవే సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు. థియేటర్లో ఒక సినిమాకే ఛాన్స్. అదే మల్టీప్లెక్స్ అయితే ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి, వాటికితోడు ఇతర ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లు ఉంటాయి. ఇక సౌకర్యాలు, సాంకేతికత మల్టీప్లెక్స్‌లు చాలా ఎక్కువ. ఈ డిఫరెన్స్కి ఇప్పుడు నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రేక్షకుల అభిరుచులు యాడ్ అయ్యేసరికి సింగిల్ స్క్రీన్ల పరిస్థితి కష్టంగా మారింది.
థియేటర్ లా ఉంటే ఏంటి? సినిమా బాగుందా లేదా అని చూసేవారు ఒకప్పుడు. అయితే ఇప్పుడు థియేటర్ పరిస్థితి కూడా కీలకంగా మారింది. అందుకే టికెట్ బుక్ చేసేముందు థియేటర్ పరిస్థితి మైండ్లోకి వచ్చేస్తుంది. రిలీజ్ అయితే తొలి మూడు రోజులు ఈ మాట వినిపించదు, కనిపించదు. కానీ ఆ తర్వాత నుండి అదే పెద్ద ఫ్యాక్టర్. దీంతో సింగిల్ స్క్రీన్‌లో ఎక్కువ రోజులు సినిమాలు నడవడం లేదు. అయితే ఇప్పుడు నిర్మాతలు చేస్తున్న రెండు పనులు ఇంకా ఇబ్బందిని తీసుకొస్తున్నాయి.
నిజానికి నిర్మాతలు చేస్తున్న పని ఇటు సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లకు ఇబ్బందే అయినా.. పైన చెప్పినట్లుగా మల్టీప్లెక్స్‌లకు అదనపు సౌకర్యాలు, కొత్త సాంకేతికతలు కలిసొస్తున్నాయి. చాలా నెలల క్రితం సినిమా పరిశ్రమ మొత్తం షూటింగ్‌లు బంద్ చేసి.. తీవ్రంగా చర్చించుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ఇప్పుడు పాటించకపోవడమే అసలు సమస్య. థియేటర్లలో వచ్చిన ఎనిమిది వారాలకు ఓటీటీలకు సినిమా ఒక నిర్ణయమైతే, మరో నిర్ణయం ఏ ఓటీటీలో వస్తుందో రిలీజ్ సమయంలో చెప్పకపోవడం.
ఈ రెండు విషయాలు బయటకు చెప్పారు కానీ.. నిర్ణయాల్లో లేనట్లు ఉన్నాయి. అందుకే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లోనే ఓటీటీ లోగో కనిపిస్తోంది. ఇక రిలీజైన డేట్ మళ్లీ క్యాలెండర్లో రాకుండానే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో ఓటీటీలో చూసేద్దాం అని ఆగుతున్నారేమో అనే డౌట్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల విషయంలో నిర్మాతలు రీథింక్ చేయాలేమో అనే చర్చ మొదలైంది.