Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ ఇక్కడ ఓకే.. కానీ అక్కడ కష్టమే..!
July 14, 2024 / 05:03 PM IST
|Follow Us
కమల్ హాసన్కాం(Kamal Haasan) – శంకర్ (Shankar) బినేషన్లో రూపొందిన ‘భారతీయుడు’ సినిమా 1996 లో వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఓ కమర్షియల్ సినిమాని ఇలా కూడా తీయవచ్చా.. అని సౌత్ సినిమా డైరెక్టర్స్ అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. 75 ఏళ్ళ వృద్ధుడితో ఫైట్స్ వంటివి చేయించినా.. చూసి విజిల్స్ వేయడానికి మాస్ ఆడియన్స్ సైతం సిద్ధంగా ఉన్నారు.. కానీ దానికి తగ్గట్టు కంటెంట్ కూడా ఉండాలి అని చాటిచెప్పిన సినిమా ‘భారతీయుడు’.
టెక్నాలజీ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో కూడా ఆ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి సినిమాకి 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఏర్పడతాయో చెప్పనవసరం లేదు. ‘భారతీయుడు 2′(Bharateeyudu 2) ప్రాజెక్టు మొదలైనప్పుడు.. అంచనాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. కానీ రిలీజ్ టైంకి తగ్గిపోయాయి. దానికి కారణం షూటింగ్ అనేక సార్లు వాయిదా పడటం, రిలీజ్ డిలే అవ్వడం వంటి కారణాల వల్ల.
మొత్తానికి నిన్న అంటే జూలై 12 న ‘భారతీయుడు 2’ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ని గమనిస్తే.. అవి కూడా నిరాశపరిచినట్టే కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా రూ.175 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది భారతీయుడు.మొదటి రోజు కేవలం రూ.30 కోట్ల షేర్ మాత్రమే నమోదయ్యింది.
అంటే ఇంకా రూ.145 కోట్ల షేర్ ని రాబడితేనే ‘భారతీయుడు 2’ గట్టెక్కినట్టు. తెలుగులో కొంత బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి. రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజు రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 2 వ రోజు కూడా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ ఉన్నాయి. 60 శాతం వీకెండ్లో రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.