Jr NTR,Hrithik Roshan: జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో హృతిక్ కు ఆ రికార్డ్ దక్కుతుందా?

  • February 7, 2024 / 04:35 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగిన హృతిక్ రోషన్ ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హృతిక్ రోషన్ నటించిన సినిమాలేవీ ఇప్పటివరకు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించలేదు. హృతిక్ రోషన్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నా ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరుస్తున్నాయి.

అయితే వార్2 సినిమాలో హృతిక్, తారక్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్, తారక్ కాంబో సీన్లు వేరే లెవెల్ లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో హృతిక్ రోషన్ కు సరికొత్త రికార్డులు సొంతమవుతాయేమో చూడాలి. వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

హృతిక్, ఎన్టీఆర్ కాంబో మూవీ కావడంతో ఈ సినిమాకు పోటీగా మరో సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ కూడా ఆసక్తి చూపరు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు. దేవర రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. వార్2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ (Jr NTR) ఇతర ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్2 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus