తండ్రి సినిమాకి సాయం చేస్తే .. కొడుకు జీవితంలో నిజంగా జరిగింది..!
February 28, 2019 / 02:42 PM IST
|Follow Us
గతంలో మణిరత్నం తెరకెక్కించిన ‘చెలియా’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. కార్తీ, అదితి రావు హైదరి… హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలోయుద్ధ పైలెట్ గా నటించాడు కార్తీ. కాగా ఓ సీన్లో కార్గిల్ వార్ లో హీరో నడుపుతున్న విమానం పాక్ సైన్యం చే కూల్చబడుతుంది. అయితే అందులో నుండీ బయటపడిన కార్తీని పాక్ సైన్యం బంధిస్తుంది. ఇక అలాంటి సీన్ తీయాలంటే కచ్చితంగా యుద్ధ విమానాల గురించి తెలిపే వారు కావలి. ఆసమయంలో ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం సింహకుట్టి వర్ధమాన్ ను కలిసాడు.
ఇంతకీ సింహకుట్టి వర్ధమాన్ ఎవరు అనేగా మీ అనుమానం. ఇటీవల భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావటం.. వాటిని తరిమే క్రమంలో పొరపాటున భారత యుద్ధ విమానం ఎల్ వోసీ క్రాస్ చేయటం.. పాక్ దాన్ని కూల్చేయడం జరిగింది. అయితే.. అలా కూలిపోయిన ఆ యుద్ధ విమానం నుండీ దురదృష్ట వశాత్తు .. పాక్ సైన్యానికి చిక్కిన యుద్ధ పైలెట్ అభినందన్. ఈయన ఎవరో కాదు.. చెలియా సినిమాకు సాయం చేసిన సింహకుట్టి వర్ధమాన్ కుమారుడు. అయితే యాదృచ్చికంగా … ఓ సినిమాలో ఏ సీన్ కి అయితే ఓ వ్యక్తి సాయం చేసాడో అదే సంఘటన ఆ వ్యక్తి కొడుకు విషయంలో నిజంగా జరగడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా అభినందన్ క్షేమంగా ఇండియాకు తిరిగిరావాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.