Tollywood: టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి కారణం వారేనా?
July 27, 2022 / 04:12 PM IST
|Follow Us
సినిమా నిర్మాతలు అందరూ కలసి నిర్మాతల మండలి అని చాలా ఏళ్ల క్రితం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఓ పెద్ద టీమ్ ఉంటుంది. నిర్మాతల సమస్యలు, ఇబ్బందులను అందులో చర్చించి ఓ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే పెద్ద నిర్మాతలు అందరూ కలసి కొన్నేళ్ల క్రితం మరో మండలి ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పెద్ద నిర్మాణ సంస్థలన్నీ భాగస్వాములు అయ్యాయి. ఇప్పుడు వాళ్లంతా కలసి ఏకంగా సినిమాల చిత్రీకరణనే ఆపేయమంటున్నాయి. దీంతో సినీ కార్మికుడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకిలా జరుగోతంది.
కొత్త ‘భారీ’ మండడలిలో పెద్ద పెద్ద నిర్మాతలే ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు టాలీవుడ్‌పై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నారు అని చెప్పొచ్చు. మంచి సక్సెస్ రేటు, జడ్జిమెంట్స్తో భారీ విజయాలు అందుకుంటూ సాగిపోయారు. అయితే తాజాగా వారి పరిస్థితి చూస్తుంటే ఏ మాత్రం బాగాలేదు అని అర్థమవుతోంది. టాలీవుడ్లో ఇటీవల కాలంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలు అన్నీ వీరి నుండి వచ్చినవే.. అలాగే దారుణ పరాజయాలు కూడా వారి నుండే వచ్చాయి. అయితే ఆ నిర్మాణ సంస్థలు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కరోనా పరిస్థితుల తర్వాత ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్లు పెంచడంలో ఈ మండలి ఉందని చెప్పొచ్చు. అలాగే హీరోలు, దర్శకులకు పెద్ద ఎత్తున అడ్వాన్స్‌లు ఇచ్చి సినిమాలను రిజర్వ్‌లు పెట్టడంలోనూ ఈ మండలిలో ఉన్న నిర్మాతలు చురుగ్గా ఉంటారు. ఎప్పుడో మూడు, నాలుగేళ్ల క్రితం అడ్వాన్స్‌లు ఇంకా సినిమా రూపం దాల్చలేదు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత డబ్బు తెచ్చి హీరోలకు ముందుగా పోసేసి.. వడ్డీలు కట్టుకొని తిరిగి లాస్లకు కారణం వెతకడం ఎంతవరకు కరెక్ట్.
కొత్తగా ఓ మండలి ఏర్పాటు చేసి.. తమ సినిమాకు డబ్బులు వచ్చినప్పుడు అందరూ కలసి బాగానే లాభపడ్డారు. ఇప్పుడు ప్రజలకు టికెట్ రేటు భారం కావడం, ఓటీటీలు ముందుకురావడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల ఇబ్బంది, కష్టాన్ని తక్కువ చేయడం లేదు. ఆశ.. అత్యాశగా మారితే.. ఏం చేసినా ఇంతే అవుతుంది అని అంటుంటారు పెద్దలు. ఇప్పుడు అదే జరిగిందా?