Rakul Preet Surgery: రకుల్ ప్రీత్ ముఖంలో ఈ తేడా గమనించారా?
September 27, 2021 / 03:13 PM IST
|Follow Us
ముఖారవిందం కోసం సర్జరీలు… మన దగ్గర హీరోయిన్లు ఇలాంటి పనులు చేయడం తక్కువ కానీ, బాలీవుడ్లో మాత్రం తెగ చేసుకుంటుంటారు. ఈ మాట మేం చెప్పడం లేదు. గతంలో ఈ పని చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు కాబట్టి అన్నాం. అయితే ఇప్పుడు బాలీవుడ్లో నిలదొక్కుకుంటున్న, అందుకు ప్రయత్నాలు చేస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఇదే పని చేసిందా? అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ఇటీవల రకుల్‌ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ పెట్టింది.
మామూలుగా అయితే ఫొటో చూసి లైక్ కొట్టేస్తుంటారు. నచ్చకపోతే ఏదో ఒక ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ ఫొటో చూశాక వేరే చర్చ నడుస్తోంది. అదే సర్జరీ. దీనికి కారణం కూడా ఉంది. అదే ఆమె పెదవుల్లో కనిపిస్తున్న తేడా. గతంలో రకుల్ పెట్టిన ఫొటోలు, ఇప్పటి ఫొటో చూస్తే పెదవుల్లో తేడా కనిపిస్తోంది. ఇప్పుడు పెదవులు దగ్గరగా ముద్దగా కనిపిస్తున్నాయట. బాలీవుడ్లో హీరోయిన్లు ముచ్చటైన పెదవులు కోసం… (అక్కడ పౌట్ కోసం అంటారు లెండి’ సర్జరీలు చేసుకుంటూ ఉంటారు.
గతంలో కొంతమంది నాయికలు ఈ పని చేసినట్లు సమాచారం. ఇప్పుడు రకుల్ కూడా అదే పని చేసిందని టాక్. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. ఇంకా వాటిని పెంచుకోవడానికి, యువతను ఆకర్షించడానికే ఈ ప్రయత్నం అని టాక్. ఏం రకుల్ నిజమేనా?