Sai Dharam Tej: కొత్త అనుమానాలు రేగొట్టిన దేవా కట్టా!

  • September 29, 2021 / 01:36 PM IST

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం ఎలా ఉంది? గత రెండు,మూడు రోజులగా ఈ ప్రశ్న చాలామందిలో వినిపిస్తోంది. దానికి కారణం ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ చేసిన వ్యాఖ్యలే. పవన్‌ మాటల ప్రకారం చూస్తే… సాయితేజ్‌ ఇంకా కోమాలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయం వైద్యులు, కుటుంబ సభ్యులు చెప్పలేదు ఎందుకో అని అనుకుంటున్నారు అభిమానులు. అయితే తాజాగా దర్శకుడు దేవా కట్టా చేసిన వ్యాఖ్యలు మరో దుమారం రేపేలా ఉన్నాయి.

‘‘రోడ్డు ప్రమాదం తర్వాత సాయితేజ్‌ని కలిసి మాట్లాడా. ఆ తర్వాతే అక్టోబర్‌ 1న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని చెప్పారు దేవా కట్టా. ఇక్కడివరకు ఒకటి అనుకుంటే… ఆ తర్వాత ‘‘సాయితేజ్‌ ‘రిపబ్లిక్‌’ ప్రి రిలీజ్ ఈవెంట్ చూశారు’’ అని కూడా చెప్పారు దేవా కట్టా. ఓవైపు ‘సాయితేజ్‌ ఇంకా కోమాలో ఉన్నాడు’ అని పవన్‌ చెబుతుంటే… దేవా కట్టా ఎప్పుడు కలిశారు, ఎలా మాట్లాడారు అనేది ఇక్కడ పాయింట్‌.

సాయితేజ్‌ త్వరగా కోలుకోవాలి అనేది అందరి ఆశ. అయితే ఇలా సాయితేజ్‌ ఆరోగ్యం గురించి, ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటే… అభిమానులకు ఎలా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సాయితేజ్‌ కుటుంబం నుండి కానీ, మెగా ఫ్యామిలీ నుండి కానీ, కనీసం వైద్యుల నుండి కానీ సాయితేజ్‌ ఆరోగ్యం మీద క్లారిటీ ఇస్తే బాగుండు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus