Actress: అఖిల్‌ హీరోయిన్‌కు ఇలా కలిసొస్తోందా… నెక్స్ట్‌ సినిమా ఎవరితోనో?

  • June 17, 2023 / 03:19 PM IST

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో రీల్స్‌ చూసి, చేసి అలసిపోయుంటారు మీరు. ఒకానొక సమయంలో రీల్స్‌ రిపీట్‌ అయ్యి.. బోరు కొట్టేసుంటుంది కూడా. అయితే ఇలా రీల్స్‌ చేసి ఓ అమ్మాయి హీరోయిన్‌ అయిపోయింది. ఆమెనే సాక్షి వైద్య. ‘ఏజెంట్‌’ సినిమాలో అఖిల్‌ సరసన నటించింది ఈ బ్యూటీ. క్యూట్‌ ఫేస్, నైస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది అనే చెప్పాలి. ఆ సినిమా రిలీజ్‌ కాకముందే వరుణ్‌తేజ్‌ సినిమాలో ఛాన్స్‌ సంపాదించిన సాక్షి.. ఇప్పుడు మరో సినిమా ఛాన్స్‌ కొట్టేసింది.

ఈ మూడు సినిమాల విషయంలో ఓ కామన్‌ పాయింట్‌ ఉండటం గమనార్హం. అవును.. సాక్షి చేసిన, చేస్తున్న, చేయబోయే సినిమాలు అన్నీ స్టార్‌ కుటుంబాల హీరోలవే. అవును తొలి సినిమా అఖిల్‌ అయితే, రెండో సినిమా వరుణ్‌, ఇప్పుడు మూడో సినిమా సాయిధరమ్‌ తేజ్‌. అవును సాక్షి మూడో సినిమా సాయితేజ్‌తో ఉండబోతోంది. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉండబోతోందని టాక్‌. రెండు, మూడు సినిమాల నిర్మాత ఒకరే కావడం ఇక్కడ గమనార్హం.

‘విరూపాక్ష’ సినిమాతో రీఎంట్రీలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. పవన్‌ కల్యాణ్‌తో ‘బ్రో’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా వచ్చే నెలాఖరున వస్తుంది. దీని తర్వాత జయంత్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. జులై నుండి ఈ సినిమా చిత్రీకరణ ఉంటుందట. ఇందులోనే సాయితేజ్‌కు జోడీగా (Actress) సాక్షి వైద్యను ఖరారు చేశారట.

సాక్షి వైద్య ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’ అనే సినిమాలోలో నటిస్తోంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మాత. ఇప్పుడు అదే బ్యానర్‌లో అదే మెగా ఫ్యామిలీలో సాక్షి నటించబోతోంది అన్నమాట. ఇలా చూస్తుంటే నెక్స్ట్‌ మిగిలిన మెగా హీరోలతో ఆమె నటించే అవకాశం ఉంది. అప్పుడు టాలీవుడ్‌లో మరో మెగా హీరోయిన్‌గా సాక్షి మారబోతోంది. పనిలో పనిగా నాగచైతన్యతో కూడా నటించేస్తోంది మెగా – అక్కినేని హీరోయిన్‌ అయిపోతుంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus