Salman Khan: హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో ఎఫైర్!
January 11, 2022 / 10:06 PM IST
|Follow Us
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో చాలా మందితో డేటింగ్ చేశాడు. ఐశ్వర్యారాయ్, సోమీ అలీ, సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కాస్త పెద్దదే. సల్మాన్ డేటింగ్ చేసిన వాళ్లలో ఎక్కువ మంది హాఫ్ ఇండియన్స్ ఉంటారు. కత్రినా కైఫ్ హాఫ్ ఇండియన్. జాక్వెలిన్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచిన విదేశీ భామ. ఈ విషయాలను పక్కన పెడితే.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఆమె పేరేంటంటే.. సమంత లాక్ వుడ్. అమెరికాకు చెందిన ఈ మోడల్, నటి.. హాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ఈమె హృతిక్ రోషన్ తో కలిసి ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తుందని టాక్.
ఇటీవల సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో కూడా ఈమె పాల్గొందని.. అతడితో చాలా సన్నిహితంగా మెలుగుతుందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. వీరిద్దరి సాన్నిహిత్యం కొన్నాళ్లుగా సాగుతుందని అంటున్నారు. సల్మాన్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ బీటౌన్ టాక్. అయితే సమంత లాక్ వుడ్ మాత్రం అందులో నిజం లేదని.. తాము జస్ట్ ఒకరికొకరు తెలిసినవాళ్లం మాత్రమేనని చెబుతోంది. ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ముంబైలోనే ఉంటుంది. ఓ సినిమా కోసం ఆమె ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.