అన్‌స్టాపబుల్‌లో ఆ స్టార్‌ హీరోలు? బాలయ్య ఏమన్నాడంటే..?

  • October 6, 2022 / 03:28 PM IST

నందమూరి బాలకృష్ణలోని కొత్త కోణాన్ని చూపించింది ‘అన్‌స్టాపబుల్‌’. ఆహా ఓటీటీలో ప్రసారమైన ఈ టాక్‌ షో గేమ్‌ ఛేంజర్‌ అనే చెప్పాలి. బాలయ్యను అలాంటి కోణంలో ఇప్పటివరకు చూడని ఫ్యాన్స్‌, ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యారు. దానికితోడు మొదటి సీజన్‌కి వచ్చిన గెస్ట్‌లు కూడా అలాంటి వారే. స్టార్‌ నటుల్ని తీసుకొచ్చి కార్యక్రమాన్ని భలేగా విజయవంతం చేసింది ఆహా అండ్‌ అన్‌స్టాపబుల్‌ టీమ్‌. అయితే ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్‌ 2’ త్వరలో రాబోతోంది. దీంతో ఈ షోలో ఈ సారి ఎవరు వస్తారు అనే ప్రశ్న మొదలైంది.

దాంతోపాటు తోటి స్టార్‌ హీరోలు వస్తారా అనేది మరో ప్రశ్న. అంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ లాంటివి రెండో సీజన్‌లో వస్తారా అంటూ చర్చ జరుగుతోంది. దీనిపై బాలకృష్ణ దగ్గర ఇటీవల ప్రస్తావిస్తే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్లు రెండుగా డివైడ్‌ అయిపోయారు. ఒక వర్గం బాలయ్య అన్నది కరెక్ట్‌ అంటుంటే, మరో వర్గం మాత్రం అలా ఎలా అంటారు అని అంటున్నారు. ఇంతకీ బాలయ్య ఏమన్నాడు అనేగా మీ ప్రశ్న.

‘అన్‌స్టాపబుల్‌ 2’లో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ పాల్గొనే అవకాశాలున్నాయా అని అడిగితే.. అవును ఆ ఛాన్స్‌ తప్పకుండా ఉంది. అయితే అది వాళ్ల ఇష్టం, సమయాభావానికి అనుగుణంగా వాళ్లు పాల్గొనే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు వాళ్లు కార్యక్రమంలో పాల్గొనేలా టీమే ప్రయత్నం చేయాలి అని ముగించారు. ఇక్కడే ప్రశ్న వచ్చింది. ‘అన్‌స్టాపబుల్‌’ తొలి సీజన్‌కు వచ్చినవాళ్లలో చాలామంది బాలయ్య మాటతోనే వచ్చారు అని అంటారు. ఇప్పుడు అదే మాట వీరి దగ్గర కూడా అంటే కచ్చితంగా వస్తారు.

మరోవైపు ఆ హీరోలు తమకు తాము మీ షోకి వచ్చి మాట్లాడతాం అని అడగలేరు. ఇక షో టీమ్‌ అంటే.. అందులో బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఉన్నారు. మరి ఆమె ఏమన్నా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. లేదంటే షోను వెనకుండి నడిపిస్తున్న బీవీఎస్‌ రవి ప్రయత్నించాలి. ఇంకా లేదంటే ఆ బాధ్యత అల్లు అరవింద్‌ భుజాన వేసుకోవాలి. చూద్దాం ఏమవుతుందో?

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus