ప్రెజంట్ జనరేషన్ హీరోల్లో టాలెంట్ తోపాటు స్టార్ డమ్ ఉన్న హీరోల్లో శర్వానంద్ ఒకడు. మనోడు సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేయాలే కానీ.. స్టార్ హీరోగా ఎదగడానికి అన్నీ లక్షణాలు ఉన్నాయి. కానీ.. అదృష్టం వరించకో లేక సెలక్షన్ సరిగా లేకపోవడం వలనో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు కానీ.. హీరోగా మాత్రం స్టార్ డమ్ కానీ స్టాండర్డ్ మార్కెట్ కానీ సంపాదించుకోలేకపోయాడు. అలాగని మనోడికి సినిమాలు లేకుండా కూడా లేవు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేసే కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ శర్వానంద్. కానీ.. కెరీర్ పరంగా సరైన ప్లానింగ్ లేకపోవడంతో మార్కెట్ పరిధి పెంచుకోలేకపోతున్నాడు.
హీరోలందరూ తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లోనూ మార్కెట్ ను పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే.. శర్వానంద్ మాత్రం తెలుగుకు మాత్రమే పరిమితం అయిపోయాడు. రిస్క్ చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ప్రస్తుతం సుధీర్ వర్మతో ఒక సినిమాతోపాటు “96” రీమేక్ లో నటిస్తున్న శర్వానంద్ ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాన్ని తమిళంలో విడుదలకు ఆలోచించడం లేదు. అయితే.. ఒక తెలుగు-తమిళ్ బైలింగువల్ సైన్ చేశాడని టాక్ వినిపిస్తున్నప్పటికీ కన్ఫర్మేషన్ మాత్రం లేదు.