Manchu Vishnu: మంచు విష్ణు వార్నింగ్.. అందరికీ వర్తిస్తుందా.. నెటిజన్ల ప్రశ్న!
October 17, 2022 / 08:59 AM IST
|Follow Us
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఉన్నవారికే.. తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వాలి. ఈ మేరకు నిర్మాతలతో మాట్లాడతాం అంటూ ఇటీవల సంఘం అధ్యక్షుడు మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది గడిచిన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ మాటలు చెప్పాడు. అయితే ఆయన మాటలు, వ్యాఖ్యలు, వార్నింగ్స్ విషయంలో సోషల్ మీడియాలో మరో రకమైన వాదన వినిపిస్తోంది. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన ‘జిన్నా’ ఈ నెల 21న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో నటించిన అందరూ.. ‘మా’ సభ్యులేనా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సన్నీ లియోన్‌కు ఈ సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు కూడా ఆమె కూడా ‘మా’ మెంబరేనా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు మంచు విష్ణు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఎందుకంటే ఆయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలోనే ‘మా’ మెంబర్షిప్ లేని నటులు ఉన్నారు అంటే బాగోదు కాబట్టి. ఒకవేళ సన్నీ లియోన్‌కి మెంబర్షిప్ ఉంటే.. అద చూపించి అందరిని ఎడ్యుకేట్ చేయొచ్చు కూడా.
‘అందరూ ‘మా’ సభ్యత్వం తీసుకుంటారు, తీసుకోవాలి. లేకపోతే ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి తెలుగు నిర్మాతల డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా?’ అంటూ మంచు విష్ణు మీడియా ముందు కాస్త గట్టిగానే చెప్పాడు. ఒకవేళ ఎవరైనా నిర్మాతలు ఈ విషయంలో సరిగ్గా రెస్పాండ్ కాకపోతే.. వారికి ‘మా’ నుండి సహాయ నిరాకరణ చేస్తాం అని కూడా అన్నారు. అయితే ఆ పరిస్థితి రాదు అని కూడా చెప్పారు.
మరిప్పుడు తన సినిమాలో నటించినవాళ్లంతా ‘మా’ సభ్యులేనా అనేది నెటిజన్ల ప్రశ్న. ఒకవేళ ఈ నిర్ణయానికి ముందు తీసిన సినిమా కాబట్టి ‘జిన్నా’ సినిమాకు ‘మా సభ్యత్వం’ రూల్ వర్తించదు అనుకుంటే.. ఆ తర్వాత విష్ణు చేసే సినిమాల్లో కచ్చితంగా ఈ రూల్ పాటిస్తారు అనుకోవాలి. చూద్దాం విష్ణు ఏదైనా అన్నాడు అంటే కచ్చితంగా చేస్తాడు కాబట్టి.. ఈ రూల్ పక్కాగా ఫాలో అవుతారనే అనుకోవాలి.