బిగ్ బాస్-4 లో పాల్గొనబోయే సెలబ్రిటీలను ఫైనల్ చేసిన స్టార్ట్ మా టీం..!
July 20, 2020 / 08:07 PM IST
|Follow Us
తెలుగు నాట ‘బిగ్బాస్’ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సీరియల్స్ కు కామెడీ షో లకు మొహంవాసి పోయో ఏమో కానీ.. ‘బిగ్ బాస్’ షో ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారనే చెప్పాలి. ఇప్పటి వరకూ 3 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యగా.. రెండో సీజన్ ను నాని, మూడో సీజన్ ను నాగార్జున వంటి హీరోలు హోస్ట్ చేశారు.
ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. త్వరలో నాలుగో సీజన్ ను కూడా మొదలు పెట్టాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సీజన్ 1 ను 70 రోజులు, సీజన్ 2 ని 100 రోజులు, సీజన్ 3 ని కూడా 100 రోజులు..పాటు నిర్వహిస్తూ వచ్చారు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు. అయితే వైరస్ మహమ్మారి కారణంగా.. ఈసారి కేవలం 50 రోజుల పాటే.. ‘బిగ్ బాస్’ ను నిర్వహించాలని వారు డిసైడ్ అయ్యారట.
ఇక ఈ సీజన్లో పాల్గొనే కొంతమంది కంటెస్టెంట్ లను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.’జబర్దస్త్’ సూపర్ స్టార్ హైపర్ ఆది, సింగర్ మంగ్లీ,హీరో తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, రష్మీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష, నటుడు తాగుబోతు రమేష్ వంటి వారు ఇప్పటికే ఫైనల్ అయ్యారని సమాచారం. నిజానికి జూలై 3 వ వారం నుండీ ప్రారంభం అవ్వాల్సిన ఈ షో కొన్ని కారణాల వల్ల ఆగష్ట్ నుండీ మొదలుకానుందని తెలుస్తోంది. ఇందుకోసం ఎన్నో భద్రతా ఏర్పాట్లతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘బిగ్ బాస్’ సెట్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.