సమంతకి ఇది వరకే పెళ్లి అయింది

  • September 29, 2016 / 10:19 AM IST

టాలీవుడ్ క్రేజీ నటి సమంత ప్రేమ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి రోజూ వార్తల్లో కెక్కుతోంది.   యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రియురాలి గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. త్వరలో అక్కినేని కోడలు కానున్న ఈ ముద్దుగుమ్మకు ఇదివరకే పెళ్లి అయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె మాజీ ప్రియుడు హీరో సిద్ధార్థతో పెళ్లి అయిందని, సిద్దార్ధకు అది రెండో పెళ్లి కావడంతో హడావుడి చేయలేదని, సమంతకు సినిమాలో అవకాశాలు తగ్గుతాయని బయటికి చెప్పలేదని సమాచారం.

ఈ వార్తకు అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నా.. నాగ చైతన్య మాత్రం కూల్ గా ఉన్నట్లు తెలిసింది. ఇందుకు కారణం ఆరా తీస్తే సమంత తన మొదటి పెళ్లి గురించి చైతు తో ఇదివరకే చెప్పినట్లు వెల్లడయింది. అప్పుడే స్యామ్ తన వివాహానికి సంబంధించిన అన్ని ఆధారాలను మాయం చేసిందట. సో .. సమంత, చైతూల మధ్య ఎటువంటి రహస్యాలు లేవని, అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నతర్వాతే పెళ్లి నిర్ణయానికి వచ్చారన్నది హాట్ న్యూస్. వచ్చే ఏడాది వీరిద్దరూ ఆలుమగలు కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus