Waltair Veerayya: రవితేజ కోసం చిరంజీవి ఏం చేశాడనేదే సినిమానా?

  • December 21, 2022 / 03:32 PM IST

‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమాకు సంబంధించి చాలా లీక్‌లు వచ్చాయి కానీ.. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. రవితేజ సినిమాలో నటిస్తున్నాడని, ఇద్దరూ సవతి సోదరులని ఇలా చాలా విషయాలు చెప్పుకొస్తున్నారు. వీటిలో చాలావరకు నిజం అని అనిపిస్తున్నాయి. వాటి సంగతి తేలాలంటే సంక్రాంతి రావాల్సిందే. అయితే ఇప్పుడు ఈ విషయాలు నమ్మేలా మరో పుకారు బయటికొచ్చింది. అదే రవితేజ కోసం చిరంజీవి తిరగబడతాడని. అవును.. ఇద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధంతో చిరు రెబల్‌ అవుతాడు అంటున్నారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ పాత్ర నిడివి 44 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే పుకార్లు వచ్చాయి. ఆ పాత్ర ఉన్నంతసేపు సినిమా ఓ రేంజిలో ఉంటుందని చెబుతున్నారు. ఆ పాత్రకు శాడ్‌ ఎండింగ్‌ ఉంటుందని, అక్కడి నుండి డీజే వీరయ్య.. తన మాస్‌ డీజేతో విలన్ల ఆటకట్టిస్తాడని చెబుతున్నారు. విలన్ల మీద వీరయ్య తిరుగుబాటుతో సినిమాలో యాక్షన్‌ పాళ్లు బలంగా కనిపిస్తాయని కూడా చెబుతున్నారు. అప్పటికే కాస్త కామెడీ టచ్‌తో కనిపించే వీరయ్య.. ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోతాడట.

‘వాల్తేరు వీరయ్య’ విషయంలో అభిమానులు కొంతవరకు ఆనందంగానే ఉన్నప్పటికీ.. గతంలో బాబీ చేసిన సినిమాల విషయంలో కాస్త భయంగా ఉన్నారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో సినిమాలో పేస్‌ తగ్గిపోవడం లాంటి బాబీ సినిమాల్లో కనిపిస్తుంటుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఏం చేశారు అనే భయం వెంటాడుతోంది అభిమానులకు. అయితే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, వీడియోలు, పాటలు విషయంలో అభిమానులు హ్యాపీనే అని చెప్పొచ్చు.

ఇక అసలు సంగతి తేలాలంటే సంక్రాంతి దాటి 13వ తేదీ రావాల్సిందే. ఇప్పటివరకు సినిమా నుండి రెండు పాటలు వచ్చాయి. ‘బాస్‌ పార్టీ..’ పాటతో చిరంజీవి – ఊర్వశి రౌటేలా అరదగొట్టా.. రెండో పాటలో శ్రుతి హాసన్‌తో కలసి చిరు గ్రేస్‌ స్టెప్పులేశాడు. ‘శ్రీదేవి చిరంజీవి’ పాటకు మంచి స్పందనే వస్తోంది. దీంతో మూడో పాట ఎప్పుడూ అనే ప్రశ్న వినిపిస్తోంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus