ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా.. బాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనే స్థాయి నుండి ‘ప్చ్.. బాలీవుడ్ సినిమా’ అనే పరిస్థితి వచ్చింది. దీనికి సౌత్ సినిమా సత్తా పెరగడం ఒక కారణమైతే.. మరో కారణం తెలియడం లేదు. బ్రాడ్‌గా సరైన కథల ఎంపిక లేకపోవడం అని చెబుతున్నా.. ఇంకా తమ వైఫల్యానికి కారణాలు వెతుక్కుంటోంది బాలీవుడ్. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమవ్వొచ్చు అని ఓ చర్చ నడుస్తోంది.
2022 మొదట్లో బాలీవుడ్‌లో సరైన విజయాలు లేకపోవడంతో.. సెకండాఫ్‌లో హిట్ కొడతారు అని అనుకున్నారు. కానీ సెకండాఫ్ మొదలై రెండు నెలలు అయిపోవోస్తోంది. ఇప్పటికే సరైన విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. అలా అని హిట్లు లేవా? అంటే ఉన్నాయి అనే చెప్పాలి. కానీ బాలీవుడ్ స్థాయి విజయాలు కావు, వసూళ్లూ లేవు. రీసెంట్‌గా వచ్చిన స్టార్ హీరోల సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ బెడిసికొట్టాయి. దీంతో మరోసారి ‘బాలీవుడ్‌కి ఏమైంది’ అనే మాట వినిపిస్తోంది.
ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ మొదటి రోజు రూ.12 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ రూ.8 కోట్లు వసూలు చేసింది. రెండో రోజుకి ఈ వసూళ్లు ఇంకా పడిపోయాయి. దీంతో కారణాలు వెతికే పనిలో పడ్డారు. దీనికి ప్రధానంగా ఆకట్టుకునే కథ, ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకపోవడమే అని అంటున్నారు. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు హాజరవుతారని ‘గంగూభాయి కాఠియావాడి’, ‘భూల్ భులయ్యా 2’, ‘జుగ్ జుగ్ జియో’ సినిమాలు ఇప్పటికే ఈ ఏడాది నిరూపించాయి.
ఈ లెక్కన ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ విషయంలో అదే మిస్ అయ్యింది అని చెబుతున్నారు. ఆమిర్ ఖాన్ సినిమాల్లో కంటెంట్ బలంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఆమిర్ గత ఐదు చిత్రాల్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మినహా అన్నీ విషయం ఉన్న సినిమాలే. తాజాగా వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ డీలా పడటానికి బలైమన కథ లేకపోవడమే అంటున్నారు. దానికి తోడు మన దేశానికి సరిపడని పాయింట్ అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
దానికితోడు ఆమిర్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిరసనలు కూడా సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. అక్షయ్ కుమార్‌కి ఈ సంవత్సరం అస్సలు బాలేదు. ‘బచ్చన్ పాండే’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ‘రక్షాబంధన్’ కూడా అదే పరిస్థితి. అయితే ‘బచ్చన్ పాండే’ కథ సౌత్‌తో హిట్ కొట్టింది. కానీ ఆ కథ బాలీవుడ్‌లో నచ్చలేదు. ఈ లెక్కన సినిమా కథ బాగుండాలి, అది బాలీవుడ్‌కి తగ్గట్టుగా ఉండాలి అని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?