Trisha Marriage: మరోసారి తెరపైకి హీరోయిన్ పెళ్లి టాపిక్!
July 24, 2021 / 11:43 AM IST
|Follow Us
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చెలామణి అయిన త్రిష దాదాపు స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించింది. ఆ తరువాత ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అదే సమయంలో ఆమెకి ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. కొన్ని మనస్పర్థల కారణంగా వివాహం రద్దు చేసుకున్నారు.
ఆ తరువాత కెరీర్ పై ఫోకస్ పెట్టి బిజీ అయింది. రీసెంట్ గా కోలీవుడ్ హీరో శింబుని త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. అవి మర్చిపోక ముందే ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి టాపిక్ తో వార్తల్లోకెక్కింది. ప్రముఖ తమిళ దర్శకుడిని త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియడం లేదు.
ఈ వార్తలపై త్రిష ఇప్పటివరకు స్పందించలేదు. నలభై ఏళ్లు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది త్రిష. ప్రస్తుతం ఈమె ‘పొన్నియన్ సెల్వన్’, ‘సతురంగ వేట్టై’ వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి. తెలుగులో కూడా సీనియర్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు.