త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న బాలీవుడ్ కండల వీరుడు

  • June 9, 2018 / 04:22 PM IST

ఇటీవల “అక్టోబర్” చిత్రంతో హీరోగా హిట్ కొట్టడమే కాక నటుడిగా అందరి మనసులు గెలుచుకొన్న కథానాయకుడు వరుణ్ ధావన్. బాలీవుడ్ లో ప్రస్తుతం అక్షయ్ కుమార్ తర్వాత హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏకైక హీరో వరుణ్ ధావన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. త్వరలోనే ఈ కుర్ర హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తోంది.

హీరోగా సెటిల్ అవ్వడమే కాకుండా ప్రస్తుతం చేతిలో ఒక అయిదారు ప్రొజెక్ట్స్, సూపర్ స్టార్ డమ్ సొంతం అవ్వడంతో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ను పెళ్లాడడానికి పెద్దలు కూడా అంగీకరించడంతో ఈ ఏడాది పెళ్లి పీటలేక్కేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడట ఈ యువ హీరో. ఇకపోతే.. వరుణ్ ప్రస్తుతం “నవాబ్ జాదే, సుఈ దాగా, కలంక్” చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాక వరుణ్ పెళ్లి పేటలెక్కబోయే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus