మరో పవర్‌ఫుల్‌ పాత్ర ఆమె కోసం వెయిటింగ్‌

  • February 22, 2021 / 09:26 AM IST

టాలీవుడ్‌లో లేడీ బాస్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతి. తొలి తరం లేడీ బాస్‌ అని కూడా చెప్పొచ్చు. హీరోయిన్‌గా తన అందచందాలతో ఎంతగా అభిమానులను అలరించిందో, యాక్షన్‌ సినిమాలు కూడా చేసి అంతే స్థాయిలో టాప్‌ యాక్ట్రెస్‌గా నిలిచింది. సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. కొన్నాళ్లకు రాజకీయాల్లో చేరింది రాములమ్మ. ఆ సమయంలో ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా… ఇటువైపు చూడలేదు. అయితే గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు.

ప్రొఫెసర్‌ భారతి పాత్రతో తన పాత్రల ఎంపికపై స్పష్టత ఇచ్చేశారు. దీంతో ఆమె అన్ని రకాల సినిమాలు ఒప్పుకునేది లేదని అందరికీ అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో విజయశాంతి కోసం కొత్త కథలు రాసేపని మొదలయ్యింది. తాజాగా విజయశాంతి కోసం ప్రతిమా ఫిల్మ్స్‌ అనే సంస్థ ఓ పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేయిస్తోందట. అందులో ప్రధాన పాత్రకు ఆమె తప్ప ఇంకెవ్వరూ నప్పరని ప్రతిమా ఫిల్మ్స్‌ సన్నిహితులు చెబుతున్నారు. కశ్మీర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట.

సినిమాలో ప్రధానభాగం చిత్రీకరణ అక్కడే ఉంటుందట. అయితే కథేంటి, ఎప్పుడు ప్రారంభిస్తారు లాంటి సమాచారం తెలియదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus