మలయాళ చిత్రంలో మదర్ గా ఇషా తల్వార్!

  • November 23, 2017 / 07:24 AM IST

పాపం హెడ్డింగ్ చూసి ఏదేదో ఊహించేసుకోకండి. ఇక్కడ ఇషా తల్వార్ తల్లయ్యింది రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కాదు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆమె నటిస్తున్న తాజా మలయాళం చిత్రం “డెట్రాయిట్ క్రాసింగ్” అనే చిత్రంలో 16 ఏళ్ల అమ్మాయికి తల్లిగా కనిపించనుంది ఇషా తల్వార్. తమిళ గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో ఓ కెనడియన్ భామ ఇషా తల్వార్ కూతురిగా కనిపించనుందట. క్యారెక్టర్ లో జీవించడం కోసమని సెట్స్ లో ఉన్నప్పుడు కూడా “మామ్” అని పిలిపించుకోంటుందట. సెట్ లో వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న కెమిస్ట్రీని చూస్తున్నవాళ్ళంతా నిజంగా తల్లీకూతుర్లలా ఉంటున్నారు అంటూ కితాబులిస్తున్నారు.

ఇకపోతే.. తమిళం మలయాళంతోపాటు తెలుగులో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తోంది ఇషా తల్వార్. ప్రస్తుతం రాహుల్ రవీంద్ర హీరోగా రూపొందుతున్న ఓ కొత్త సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అమ్మడు తెలుగులో కనిపించిన ఆఖరి చిత్రం “రాజా చెయ్యి వేస్తే”. చూడ్డానికి జూనియర్ కత్రినా కైఫ్ లా ఉండే ఇషా తల్వార్ కు యాక్టింగ్ టాలెంట్ కూడా పుష్కలంగా ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు దొరకబుచ్చుకోలేక స్టార్ డమ్ కానీ గుర్తింపు కానీ సంపాదించుకోలేకపోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus