“ఇజం” బడ్జెట్ ఎంతో తెలుసా ?

  • August 19, 2016 / 11:48 AM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ స్టార్ హీరో ఇమేజ్ కోసం తపిస్తున్నారు. 2003 లో హీరోగా పరిచయమై 2005 లో అతనొక్కడే చిత్రంతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పదేళ్లకు 2015 లో పటాస్ ద్వారా కళ్యాణ్ రామ్ పవర్ చూపించారు. ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ టాప్ హీరో లిస్ట్ లో చేరాలని స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్నారు. వీరి కలయికలో వస్తున్న “ఇజం” మూవీ లో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. అంతే కాదు లుక్ ని కూడా పూర్తిగా మార్చారు.

స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకోసం భారీ గా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బడ్జెట్ 25 కోట్లు దాటిపోయిందని తెలిసింది. పూరి పైన కళ్యాణ్ రామ్ పూర్తి నమ్మకంగా ఉన్నాడని, ఈ చిత్రం తన కెరీర్ ని గ్యారంటీగా మలుపు తిప్పుతుందనే ధీమాతోనే ఇంత ఖర్చు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. రిపోర్టర్‌ బాలకృష్ణగా కళ్యాణ్ రామ్ కనిపించనున్న ఈ మూవీలో అదితి ఆర్య హీరోయిన్‌ గా అందాలు ఆరబోయనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus