Nabha Natesh Remuneration: రెమ్యునరేషన్ తో నిర్మాతలకు షాకిస్తోన్న నభా!
July 1, 2022 / 04:01 PM IST
|Follow Us
కన్నడ ఇండస్ట్రీకి చెందిన నభా నటేష్ హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ హిట్ అందుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా ‘మ్యాస్ట్రో’ సినిమాలో కనిపించింది. ఇప్పటివరకు మరో సినిమా సైన్ చేయలేదు ఈ బ్యూటీ. దానికి కారణం రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందట. రీసెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన కృతిశెట్టి, శ్రీలీల వంటి హీరోయిన్స్ కూడా కోటికి పైగానే తీసుకుంటున్నారని..
కాబట్టి తనకి కూడా కోటి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుందట నభా నటేష్. ఈ బ్యూటీ ఇప్పటివరకు స్టార్ హీరోలతో కలిసి నటించలేదు. మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లోనే ఆమెని తీసుకుంటున్నారు. మీడియం బడ్జెట్ లో తెరకెక్కే సినిమాల్లో హీరోయిన్లకు కోటి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే కష్టమే. ఇప్పటివరకు నభాకి ఒక్కో సినిమాకి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అమాంతం తన రెమ్యునరేషన్ డబుల్ చేసేయడంతో దర్శకనిర్మాతలెవరూ కూడా ఆమె వంక చూడడం లేదు.
ఆమె రెమ్యునరేషన్ తగ్గించుకుంటే మాత్రం అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నభా నటేష్ మాత్రం ఆ ఒక్క విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ఇలా అయితే ఆమెకి అవకాశాలు రావడం కష్టమే!