జబర్దస్త్ ఆనంద్ కు అంత రేంజ్ ఉందా..!

  • August 9, 2021 / 03:11 PM IST

‘జబర్దస్త్’ కమెడియన్ ఆనంద్ ఏంటి.. రూ.3 కోట్ల విలువగల కారు కొనుగోలు చేయడం ఏంటి? వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..! అతను ఈ మధ్య కాలంలో తన యూట్యూబ్‌ ఛానెల్ ను డెవలప్ చేసే పనిలో పడ్డాడని క్లియర్ గా స్పష్టమవుతుంది. రకరకాల తంబ్ నెయిల్స్ పెడుతూ.. ఏవేవో వీడియోలు చేస్తున్నాడు. అయితే ఇటీవల..అతను కొనుగోలు చేయబోయే లగ్జరీ కారు గురించి ఓ వీడియోని రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న SK Car Lounge‌కి తన ఫ్యామిలీతో వెళ్ళాడు జబర్దస్త్ ఆనంద్. అక్కడ రూ.3 కోట్లు విలువ చేసే ఖరీదైన కారుకి అడ్వాన్స్ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. దాని అసలు ఖరీదు భారీగా రూ.5.6 కోట్లు ఉంది.అయితే తాను తీసుకోబోయేది సెకండ్ హ్యాండ్ కాబట్టి రూ.3 కోట్లకు వచ్చేస్తుందని అతను తెలియజేసాడు. మరో రెండు నెలల్లో ఈ కారుని కొనేద్దాం అనే అనుకుంటున్నా అంటూ ఇతను కారు షోరూమ్ లో అడ్వాన్స్ కట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.

నిజంగానే ఆనంద్ దగ్గర అంత డబ్బు ఉందా లేక.. ప్రమోషన్ కోసం SK Car Lounge వాళ్ళు చేయిస్తున్నారా? అనే కన్ఫ్యూజన్ జనాల్లో ఏర్పడింది. ‘జబర్దస్త్’ కమెడియన్ కు రూ.3 కోట్లు పెట్టి కారు కొనే రేంజ్ ఉంటుందని కచ్చితంగా చెప్పలేము. కాబట్టి అదంతా ప్రమోషనల్ స్ట్రాటజీనే అయ్యుండొచ్చు అనే డిస్కషన్లు జరుగుతున్నాయి.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus