Rashmi, Sudheer: సుధీర్ పై ప్రేమను బయట పెట్టిన రష్మీ..తోడు కావాలంటూ!
May 10, 2023 / 10:38 AM IST
|Follow Us
జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మి సుడిగాలి సుదీర్ తో కలిసి చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఇలా వీరిద్దరూ పెద్ద ఎత్తున సందడి చేయడంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు.ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుధీర్ దూరమైనప్పటికీ రష్మీ సుధీర్ గురించి ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.
సుధీర్ అంటే తనకు ఎంత ఇష్టమో అనే విషయాన్ని రష్మీ బయట పెట్టేశారు. తాజాగా ఈమె నటుడు బ్రహ్మాజీతో కలిసి ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాజీ రష్మీ ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఓంకార్ యాంకర్ రష్మికి ఓ చిక్కు ప్రశ్న వేశారు. ఓం కార్ రశ్మిని ప్రశ్నిస్తూ ఒంటరిగా ఐస్లాండ్ లో ఉంటే కనుక ఏ హీరోతో ఉండాలని కోరుకుంటారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు రష్మీ (Rashmi) కాసేపు మౌనం వహించిన అనంతరం తాను చెప్పిన సమాధానం విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాను అలా ఒంటరిగా గడపాల్సి వస్తే సుధీర్ తన పక్కన ఉండాలని తన తోడు కావాలని కోరుకుంటాను. సుధీర్ అయితే తనకు మంచి కంపెనీ ఇస్తారు అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రష్మీ ఈ విధంగా సుధీర్ తనకు తోడు కావాలి అంటూ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఈ కార్యక్రమంలో అరుపులు కేకలు ఆకాశాన్ని తాకాయి. సుధీర్ ప్రస్తుతం ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తనపై ఉన్న ప్రేమ మాత్రం రష్మికి తగ్గలేదని తెలుస్తుంది. ఇలా సుధీర్ గురించి రష్మీ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ మరోసారి అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.