రంగస్థలం’ నటుడి పెళ్ళి ఆ అమ్మాయితోనేనా!

  • May 8, 2020 / 05:21 PM IST

‘జబర్దస్త్’ ద్వారా ప్రేక్షకులకు పరిచయయ్యి …కొద్ది కాలంలోనే సినిమాల్లో అవకాశం దక్కించుకుని మంచి నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. ‘జబర్దస్త్’ లో ‘కిరాక్ ఆర్పీ’ టీం ద్వారా పరిచయమైన మహేష్ ‘శతమానం భవతి’ చిత్రంతో ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయ్యాడు. ఇక ‘రంగస్థలం’ చిత్రంతో అయితే టాప్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఈ చిత్రం చిట్టి బాబు అసిస్టెంట్ గా కామెడీ చేస్తూనే ఎమోషనల్ యాంగిల్ లో కూడా ఇరగదీశాడు.

తరువాత ‘మహానటి’ చిత్రంలో సావిత్రి దగ్గర పనిచేసి ఆస్తులు కాజేసే సత్యం పాత్రలో నటించి మరింత పాపులర్ అయ్యాడు. అటు తరువాత ‘యాత్ర’ ‘మహర్షి’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన మహేష్ … తరువాత ‘గుణ 369’ లో పూర్తి తరహా నెగిటివ్ రోల్ చేసి మంచి నటన కనపరిచాడు. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మహేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అవును మహేష్ పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మహేష్ పూర్తి పేరు మహేష్ ఆచంట. ఆతని ఊరికి చెందిన అమ్మాయి అందులోనూ దగ్గరి బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకోబోతున్నాడట. లాక్ పూర్తయిన వెంటనే మహేష్ పెళ్ళి ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus