Rohini: బ్రేకప్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిణి!
August 28, 2023 / 08:01 PM IST
|Follow Us
బుల్లితెర సీరియల్స్ లో నటుడిగా నటిస్తూ అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో లేడీ కామెడియన్ గా గుర్తింపు పొందినటువంటి వారిలో జబర్దస్త్ నటి రోహిణి ఒకరు.జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో తన కామెడీ ద్వారా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి రోహిణి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెర అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా బిగ్ బాస్ ద్వారా కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు సినిమాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు.గత కొంతకాలంగా ఈమె కాలికి సర్జరీ చేయడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఈ విధంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి (Rohini) రోహిణి మొదటిసారి తన బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యారు.
ఇలా ఈమె తన బ్రేకప్ స్టోరీ చెప్పే వరకు కూడా ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా అన్న సంగతి కూడా ఎవరికి తెలిసేది కాదు. తాజాగా ఈమె తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండే వారిని తెలిపారు. ఇలా కొన్ని కారణాలవల్ల తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ జరిగిందని ఈమె తెలిపారు.
అయితే బ్రేకప్ తర్వాత తాను చాలా నరకం అనుభవించానని ఈమె తెలియజేశారు. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ నన్ను తిరిగి నా పనిపై దృష్టి పెట్టేలా చేసిందని ఈమె తెలిపారు.ఇలా బ్రేకప్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ వాడు ఆఫ్ట్రాల్.. నీ కాలిగోటికి కూడా సరిపోరు బాధపడాల్సిన పనిలేదు అంటూ తనకు మంచిగా సపోర్ట్ చేశారని తాను కూడా క్రమక్రమంగా ఆ సంఘటన నుంచి బయటపడ్డానని తెలిపారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరు ఎందుకు బ్రేకప్ అయిందనే విషయాలను మాత్రం ఈమె తెలియజేయలేదు.