మూడు నెలల తర్వాత మొదలైన ‘జబర్దస్త్’…!

  • June 17, 2020 / 07:00 PM IST

‘జబర్థస్త్’ కామెడీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోను ప్రసారం చేసే టీవీ ఛానల్ కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ ను సాధిస్తూ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చింది. అయితే గత 3 నెలలుగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ‘జబర్దస్త్’ షూటింగ్ కూడా నిలిచిపోయింది. దీంతో కొత్త ఎపిసోడ్స్ ప్రసారమవ్వలేదు. ఈ క్రమంలో పాత ఎపిసోడ్స్ నే తిరిగి ప్రసారం చేస్తూ వచ్చారు.

దీంతో సదరు టీవీ ఛానల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఎట్టకేలకు షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడంతో తిరిగి ‘జబర్దస్త్’ షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. నానక్ రామ్ గుడాలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ‘జబర్దస్త్’ షూటింగ్ ను తిరిగి ప్రారంభమైంది. అయితే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని వినికిడి. గతంలో ఈ షో అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగేదని.. ఈ షోలోని కొంతమంది కమెడియన్స్ తెలిపిన సంగతి తెలిసిందే. దానిని బట్టి పరిశీలిస్తే ఇప్పుడు ప్లేస్ మారిందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ‘జబర్దస్త్’ లో ఆల్రెడీ ఉన్న టీమ్స్ లో కొత్త కమెడియన్లు అలాగే కొత్త టీమ్స్ యాడ్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది లైఫ్ లు సెటిల్ అయ్యాయి. సినిమాల్లో కూడా వారు అవకాశాలు దక్కించుకున్నారు. మంచి నటులుగా రాణిస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 2013 లో ప్రారంభమైన ఈ షో… 7 ఏళ్ళు గడిచినా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతునే ఉంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus