Varsha: జబర్దస్త్ వర్షకి ఏమైనట్టు.. ఆందోళనలో అభిమానులు!

  • October 25, 2022 / 01:02 PM IST

సోషల్ మీడియాలో పాపులర్ అయిన జనాలను బుల్లితెర పైకి తీసుకొచ్చి లైఫ్ ఇస్తుంది ఈటీవీ యాజమాన్యం. ఇంకా కొంతమందిని ‘స్టార్ మా’ ‘బిగ్ బాస్’ తో పాపులర్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. ‘టిక్ టాక్’ వీడియోలతో పాపులర్ అయిన వర్ష.. తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఈమె తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. తన కామెడీ టైమింగ్ తో గ్లామర్ తో ‘జబర్దస్త్’ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది.

ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్..మామూలుగా ఉండవు. అంతేకాదు వీరి మధ్య రొమాంటిక్ ట్రాక్ లు కూడా షోలో ఉండడంతో వీరి మధ్య ప్రేమాయణం కూడా నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ వార్తలతో వీరు ఇంకా పాపులర్ అయ్యారు.ఇక సోషల్ మీడియాలో కూడా తన హాట్ హాట్ ఫొటోలతో యూత్ కు మత్తెక్కిస్తూ ఉంటుంది ఈ భామ.ఇదిలా ఉండగా.. వర్ష హాస్పిటల్ పాలైంది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

ఈ ఫొటోలో వర్ష హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉండగా ఆమె చేతికి సెలైన్ పెట్టి ఉండటాన్ని మనం గమనించవచ్చు.’ఆదివారం చికెన్ తినలేకపోయాను, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను’ అంటూ కామెంట్ పెట్టి .. హాస్పిటల్ బెడ్ పై చికిత్స తీసుకుంటున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది వర్ష. అలాగే పలు టెస్టులు చేయించుకున్నట్టు కూడా ఫోటోలు ఉన్నాయి.

సీజనల్ ఎఫెక్ట్ వల్లనో ఏమో కానీ ఇప్పుడు చాలా మంది జనాలు మలేరియా, డెంగ్యూ వంటి ఫీవర్లతో బాధపడుతున్నారు. ఇలాంటి ఫీవర్లు ఎటాక్ చేసినప్పుడు ఆకలి వేయకపోవడం, నీరసించి పోవడం వంటివి ఏర్పడుతున్నాయట. బహుశా వర్షకి కూడా అలాంటి ఫీవర్ వచ్చి ఉండొచ్చు అని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus