‘జబర్దస్త్’ వర్ష గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • November 20, 2020 / 10:50 AM IST

‘జబర్దస్త్’ కామెడీ షో 7ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తుంది. టి.ఆర్.పి ల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ షో. తరువాత దీనికి మరింత క్రేజ్ పెరగడంతో ‘ఎక్స్ట ట్రా జబర్దస్త్’ ను కూడా మొదలుపెట్టారు. ఈ షోలలో కామెడీతో పాటు అనసూయ, రష్మీ ల గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటుంది. ఈ షో వల్లనే వారు క్రేజ్ ను సంపాదించుకుని సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. అయితే వీళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికే అనుకుంట ఇటీవల వర్ష అనే అమ్మాయి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈమె ఓ కమెడియన్ గానే ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యన జబర్దస్త్ లో లేడీస్ కూడా స్కిట్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. హిమజ వంటి సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ ఇస్తున్నారు. అయితే కేవలం కమెడియన్ గానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈమెకు కూడా మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఇప్పుడు చాలా మంది కుర్ర కారు ఈమె కోసమే అన్నట్టు జబర్దస్త్ చూస్తున్నారు. ఆకర్షించే చక్కటి రూపం ఈమె సొంతం. మొదట్లో పలు సీరియల్స్ లో కూడా వర్ష నటించింది.

కానీ అవి ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపుని తీసుకురాలేదు. మధ్యలో అనసూయ పై ఫైర్ అవుతూ ఓ వీడియో కూడా చేసింది. అది వైరల్ అయ్యింది కానీ ఈమె ఫేమస్ అవ్వలేదు. అయితే ‘జబర్దస్త్’ పుణ్యమా అని ఈమెకు ఫ్యాన్స్ పెరిగారు. ఈమెకు ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని టాక్. మంచి పాత్ర దొరికితే వెంటనే సినీ ఎంట్రీ ఇవ్వాలని వర్ష ప్లాన్ చేస్తుందట. ఇదిలా ఉండగా.. ఈమె గ్లామర్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చీరలో అందాలను చూపిస్తూ ఆకర్షిస్తుంది వర్ష. మీరు కూడా ఆ ఫోటోలను ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus