Jabardasth Varsha: కోవిడ్ బారిన పడ్డ ‘జబర్దస్త్’ కమెడియన్!

  • April 20, 2021 / 03:58 PM IST

మన దేశంలో రోజురోజుకి కరోనా ఉధృతి పెరిగిపోతుంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. జనాలు గుంపులుగా ఉంటున్న ప్రాంతాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. షూటింగ్ లు జరపడం వలనే కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ‘జబర్దస్త్’ బ్యూటీ, లేడీ కమెడియన్ వర్షకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ విషయాన్ని వర్ష స్వయంగా వెల్లడించింది. తాజాగా లైవ్ లోకి వచ్చిన ఆమె తన ఫాలోవర్ల కొన్ని సూచనలు ఇచ్చింది. రెండు రోజులుగా తన ఆరోగ్యం బాలేదని.. టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయాన్ని లైవ్ చెప్పాలనుకున్నానని తెలిపింది. ఎందుకంటే ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. జరిగేదేదీ బయటకి తెలియడం లేదని.. చనిపోయిన వాళ్లను ప్యాక్ చేసి విసిరేస్తున్నారని.. అది చూడగానే లైవ్ లోకి వచ్చి చెప్పాలనుకున్నానని వెల్లడించింది.

అందరూ జాగ్రత్తగా ఉండాలని.. రోజూ వేడి నీళ్లు తాగమని సూచించింది. అన్ని రకాల జాగ్రత్తలు ముందు నుండే పాటించడం మంచిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్ష ‘జబర్దస్త్’ షోతో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో బిజీగా గడుపుతోంది.


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus