తన పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన వినోద్..!

  • December 27, 2019 / 06:15 PM IST

ఈమధ్య కాలంలో ‘జబర్దస్త్’ వినోద్ పేరు ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది అనడంలో సందేహం లేదు. ‘జబర్దస్త్’ లో లేడీ గెటప్ లు వేసి ఫేమస్ అయిన వినోద్ ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకుని.. ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక ఇదే క్రమంలో వినోద్ పెళ్లి కూడా ఆగిపోయిందనే టాక్ నడిచింది. ఎంగేజ్ మెంట్ అయినప్పటికీ వినోద్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇక తన ఇంటి ఓనర్ తో గొడవ విషయం కూడా పెద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు ఆ ఓనర్.. వినోద్ పై దాడి కూడా చేసాడు. ఈ విషయం పై కేసు నమోదయ్యింది.

అయితే వినోద్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వార్త కూడా ప్రచారమైంది. ఇటీవల ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చాడు వినోద్. ఆయన మాట్లాడుతూ.. ” నాకు దక్కిన ప్రత్యేక గుర్తింపు ‘జబర్దస్త్’ పుణ్యమే..! నాకు ఎంగేజ్ మెంట్ అయ్యింది.. కానీ పెళ్ళి ఆగిపోయింది అనే వార్తలో నిజం లేదు. నేను పిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యాకే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అందుకే కాస్త టైం తీసుకుంటున్నాను. నేను పెళ్లాడబోయే అమ్మాయి నాకు బంధువే..! నా గురించి అన్ని విషయాలు తెలుసు. చిన్నప్పటి నుండీ నన్ను చూస్తూనే ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో ఎటువంటి సమస్య ఉండదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus