Jabardasth Vinod: పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చిన వినోద్ భార్య విజయలక్ష్మి..!

  • June 3, 2022 / 10:50 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సాయపడింది.ఆ లిస్ట్ లో వినోద్ కూడా ఉన్నాడు. ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఇతను ఎక్కువగా లేడీ గెటప్ ల ద్వారా పాపులర్ అయ్యాడు. చమ్మక్ చంద్ర స్కిట్లలో ఇతను ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండేవాడు. లేడీ గెటప్లో వినోద్ నిజంగా అమ్మాయిలా కనిపిస్తాడు.. ఇంకా చెప్పాలి అంటే అమ్మాయిలు సైతం అసూయపడేంతలా అందంగా ఉంటాడు. దాంతో కొంతమంది నెటిజన్లు ఇతని పై నెగిటివ్ కామెంట్స్ కూడా చేసేవాళ్ళట. అలాగే వినోద్ వివాదాలతో కూడా పలు సార్లు వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా.. వినోద్ ‘జబర్దస్త్’ కు రాకముందు అతని ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్ళి చేయాలని చూశారట. దీంతో అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడట.దానికి తోడు ‘జబర్దస్త్’ లో ఇతను అమ్మాయి వేషాలతో పాపులర్ అయ్యాడు కాబట్టి ఇతను సంసార జీవితానికి యోగ్యుడు కాదని తప్పుడు ప్రచారం చేశారట.

అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. ఇతను లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన అక్క కూతురు అయిన విజయలక్ష్మి ని వినోద్ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. సుమ క్యాష్ షోలో ఆమెకు సీమంతం కూడా చేశారని వినోద్ తెలిపాడు. ఇక ఇటీవల వినోద్ భార్యకి డెలివరీ అవ్వడం.. పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ అతను ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దీంతో అతని పై ఎన్నో విమర్శలు చేసిన వాళ్లకి గట్టి సమాధానం భగవంతుడు చెప్పినట్టు అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus