Jagapathi Babu: రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు.. ఏం చెప్పారంటే?
September 20, 2023 / 12:05 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రముఖ నటుడు జగపతిబాబుకు రాజమౌళి బంధువు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు రాజమౌళి బంధువు అయినా రోల్ ఇవ్వడని అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి. జక్కన్న ఫ్యామిలీకి ఎన్ని అవార్డులు వచ్చినా వాళ్లలో అణువంతైనా గర్వం ఉండదని జగపతిబాబు కామెంట్లు చేశారు.
వాళ్ల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఈ విధంగానే ఉంటారని (Jagapathi Babu) జగపతిబాబు కామెంట్లు చేశారు. జక్కన్న నా రిలేటివ్ అయినా మూవీ ఆఫర్లు అడగనని ఆయన కూడా మూవీ ఆఫర్లు ఇవ్వడని జగపతిబాబు చెప్పుకొచ్చారు. ఏ రోల్ కు ఎవరు సూట్ అవుతారో రాజమౌళి వాళ్లనే తీసుకుంటారని ఆయన అన్నారు. సినిమాల విషయంలో రాజమౌళి అంత పర్ఫెక్ట్ అని జగపతిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. జక్కన్న కుటుంబం నుంచి 20 శాతం నేర్చుకున్నా పరవాలేదని ఆయన కామెంట్లు చేశారు.
జగపతిబాబు పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా సలార్, మరికొన్ని సినిమాలు జగపతి బాబు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే జగపతిబాబు రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. జగపతిబాబుకు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో జగపతిబాబు రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు ఈ విషయాలను వెల్లడించారు.
రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో జగపతిబాబు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు జగపతిబాబుకు క్రేజ్ పెరుగుతోంది. జగపతిబాబు మెయిన్ రోల్ లో పలు సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ ఏడాది రుద్రంగి సినిమాతో జగపతిబాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.