Jailer: అక్కడ కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన జైలర్.. రజనీకే సాధ్యమంటూ?
September 8, 2023 / 06:28 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జైలర్ మూవీ ఫుల్ రన్ లో ఏకంగా 600 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఐదు ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఈ సినిమా సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఓటీటీలో ఈ సినిమా నెంబర్ వన్ లో ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ నిర్వాహకులు భారీ స్థాయిలో ఈ సినిమా హక్కుల కోసం ఖర్చు చేయగా ఈ సినిమా ప్రైమ్ నిర్వాహకులకు భారీ లాభాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. 72 సంవత్సరాల వయస్సులో కూడా రజనీకాంత్ ఇలాంటి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ తనకు మాత్రమే ఇలాంటి రికార్డులు సాధ్యమని ప్రూవ్ చేస్తున్నారు. రజనీకాంత్ కు మాత్రమే ఇలాంటి, ఈ రేంజ్ రికార్డులు సాధ్యమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రజనీకాంత్ సరైన కథలపై దృష్టి పెట్టాలని అలా చేస్తే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరోలతో కలిసి రజనీకాంత్ సినిమాలు చేస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ హీరోలలో 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకునే వారిలో రజనీకాంత్ ఒకరిగా ఉన్నారు.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కొన్ని థియేటర్లలో (Jailer) జైలర్ మూవీ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. జైలర్ సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. తర్వాత సినిమాలతో సైతం రజనీకాంత్ జైలర్ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రజనీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.