Nelson: నెల్సన్ దిలీప్ కు పోర్చే కారును బహుమానంగా ఇచ్చిన జైలర్ ప్రొడ్యూసర్!

  • September 2, 2023 / 06:34 PM IST

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్ ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన విధంగా ఘన విజయం సాధించింది. ఆగస్టు 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సంచలనమైన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఇప్పటివరకు సుమారు 600 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో నిర్మాత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా మంచి లాభాలను అందుకున్నటువంటి నిర్మాత ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినటువంటి వారికి ప్రత్యేకంగా కానుకలు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం రజనీకాంత్ కు 110 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వగా

ఈ సినిమా మంచి లాభాలను అందుకోవడంతో అదనంగా మరో వంద కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా ఆయనకు దాదాపు కోటిన్నర విలువచేసే బియండబ్ల్యూ కారును కానుకగా అందించారు. అదేవిధంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి సైతం ఖరీదైన కారుని ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా కళానిధి మారన్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు పోర్చే లేటెస్ట్ మోడల్ కారును బహుమానంగా ఇవ్వడమే కాకుండా చెక్కు రూపంలో మరికొంత రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో (Nelson) నెల్సన్ దిలీప్ కుమార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus