Janhvi Kapoor: ఆ కుర్రాడితో జాన్వీ ముద్దులు, హగ్ లు!
September 24, 2021 / 03:39 PM IST
|Follow Us
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఓ కుర్రాడిని కౌగిలించుకొని, ముద్దులుపెట్టుకొని కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను జాన్వీ కపూర్ స్వయంగా షేర్ చేసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్నేళ్ల క్రితం జాన్వీ కపూర్ ‘దఢక్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ అనే సినిమాలో నటించింది. లాక్ డౌన్ సమయంలో ఆమె నటించి హారర్ సినిమా ‘రూహీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం జాన్వీ మరో రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తనకు వీలు కుదిరినప్పుడల్లా.. హాలిడే ట్రిప్స్ వేస్తూ చిల్ అవుతుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ పార్టీలో అక్షత్ రాజన్ అనే కుర్రాడితో జాన్వీ కపూర్ బాగా క్లోజ్ గా కనిపించడం అనుమానాలకు దారితీసింది. నిజానికి అక్షత్ రాజన్ అనే వ్యక్తితో గతంలో చాలా సన్నిహితంగా ఉండేది జాన్వీ.
కానీ ఆ తరువాత కాలంలో వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అక్షత్ రాజ్ తో ఆమె మరింత క్లోజ్ గా కనిపించడంతో వీరిమధ్య ప్రేమ మళ్లీ చిగురించింది బీ టౌన్ టాక్. మరి ఈ పుకార్లపై జాన్వీ కపూర్ స్పందిస్తుందేమో చూడాలి!