అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి “దఢక్”తో సూపర్ ఎంట్రీ ఇచ్చారు. గత నెల 20న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జాన్వి నటనను విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇషాన్ కట్టర్ హీరోగా నటించిన ఈ చిత్రం తొలిరోజున దేశవ్యాప్తంగా 8.71 కోట్లు రాబట్టగా, మూడు రోజుల్లో 33.67 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. మరాఠీలో హిట్ కొట్టిన ప్రేమకథను మరింత నాధంగా చూపించడంలో దర్శకుడు శశాంక్ ఖైతాన్ విజయం సాధించారు. ప్రేమ, భావోద్వేగాలు కలగలిసిన ఈ మూవీ యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అపూర్వ మెహతా.. కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో (జులై 30 నాటికీ) ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. షేర్ 63.39 కోట్లను వసూలు చేసింది. తొలి చిత్రంతోనే జాన్వీ 100 కోట్ల ఫీట్ ను సాధించడంతో బోనీ కపూర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తొలి అడుగు విజయవంతంకావడంతో జాన్వీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆమె చేసే నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. హిందీలోనే సినిమా చేస్తారా? దక్షిణాదిన అడుగుపెడతారా? అనేది.. ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.